Gangamma Jatara: కనుల పండువగా గంగమ్మ జాతర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ఈ జాతర బుధవారం బుధవారం నుంచి ప్రారంభం కాగా.. తొమ్మిది రోజుల పాటు ఈ జాతర నిర్వహించనున్నారు. రోజుకో వేషంలో భక్తులు కనిపిస్తారు. ఏటా చైత్రమాసం చివరిరోజు ఈ జాతర నిర్వహిస్తారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తొలి సారెను సమర్పించారు. భూమన కుటుంబ సభ్యులకు ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. గతరెండేళ్లుగా జాతర ఏకాంతంగానే నిర్వహించారు.
కరోనా వల్ల జాతర సందడి లేకుండా పోయిందని.. ఈ ఏడాది అంతా బాగుందని, అమ్మవారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందంటున్నారు తిరుపతి వాసులు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొమ్మిది వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోందని తిరుపతి వాసులు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కి చెల్లెలుగా అమ్మవారికి స్వామి సారె అందుతుంది. జాతర ప్రారంభం నాడే వర్షం పడింది. ఇది ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి సంకేతం అంటున్నారు.
జాతర సదర్భంగా టీటీడీ అధికారులు సారెను అందిస్తారు. జాతర నాలుగోరోజున టీటీడీ అర్చకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుట్టింటి సారె అందజేస్తారు. పూర్వం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకునేవారు. అలా చేస్తే తిరుపతి యాత్ర సంపూర్ణం అవుతుందని, చెల్లెలిని కొలిచే వచ్చేవారిని శ్రీవారు కరుణిస్తారని నమ్మకం. తాతయ్య గుంట గంగమ్మకు సారె ను సమర్పించనున్నారు మంత్రులు రోజా, నారాయణ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!