ఒంగోలులో టీడీపీ మహానాడు బహిరంగ సభ ప్రారంభం అయింది. భారీ ఎత్తున మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు కార్యకర్తలు. ఇంకా వివిధ మార్గాల్లో చేరుకుంటున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బహిరంగ సభకు రానున్నారు చంద్రబాబు. 6:30 చంద్రబాబు ప్రసంగం వుంటుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్. బహిరంగ సభకు బాలకృష్ణ హాజరు కానున్నారు.
బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారికి ఉన్నక పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. రేయ్ నా కొడకల్లారా..? మహానాడుకు ఎంత మంది వచ్చారో చూస్తున్నారా..? గంట, అరగంట అంటూ మల్లెపూలోయ్ మల్లెపూలు అనే వాడు ఓ మంత్రి. మా తెలుగుదేశం నేతలకు రోజమ్మ ఏదో చీరలు పంపుతుందట.
రోజా తన భర్తకు చీర కట్టించి ఇంట్లో కూర్చొ పెట్టింది. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు. తమ్మినేని ఓ దౌర్భాగ్యుడు అని మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు. తెలుగు తమ్ముళ్లు ఒంగోలు పౌరుషం చూపించారన్నారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. ప్రకాశం జిల్లా గడ్డపై టీడీపీ తన సత్తాను చాటింది. కౌరవ సభ నుంచి వచ్చేసిన చంద్రబాబును గౌరవ సభలో కూర్చొపెట్టేంత వరకూ కార్యకర్తలు విశ్రమించవద్దు. భవిష్యత్ నాయకుడైన లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి యువత సిద్దంగా ఉందన్నారు ఏలూరు సాంబశివరావు.
మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ఒంగోలు చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు. కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోతున్నారు వాలంటీర్లు. వారికి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. వేదిక మీద ప్రసంగించటానికి 12 మందికి మాత్రమే అనుమతి వుంది.
Mahanadu 2022: పొత్తుల ఊసే లేకుండా టీడీపీ తీర్మానం