ఏపీ మినిస్టర్ రోజా టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త సెల్వమణి అన్న మాటలను వారు వక్రీకరించి తప్పుగా అర్థమయ్యేలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రోజా భర్త ఆర్. కె సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇక ఇటీవల ఆయన మీడియా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా…
మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. తాజాగా విజయవాడలో ఆమె శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో శిక్షణా శిబిరాలను ప్రారంభించి ప్రసంగించారు. కరోనా వల్ల రెండు ఏళ్లు క్రీడాకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడతాయి. 48 విభాగాల్లో…
ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేను అని ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఎన్టీవీ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని సమాధానమిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో రంజిత్‌రెడ్డి తనకు…
ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. జగన్ సోదర సమానుడు.. ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అన్నారు కేటీఆర్. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రం లో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో గత రాత్రి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరణ…
మినిస్టర్ రోజా సెల్వమణి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి చిరు కుటుంబాన్ని పలకరించారు. మంత్రి రోజాను, చిరు కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. అనంతరం ఆమె మంత్రి పదవి అందుకున్నందుకు చిరు , రోజా దంపతులను సన్మానించారు. కొద్దిసేపు ఇరు కుటుంబాలు ముచ్చటించుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ రోజా, చిరుతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో షేర్…
చంద్రబాబు, లోకేష్‌కు చీర పంపిస్తామని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రోజా తనకు చీర పంపిస్తా అంటున్నారని.. ఒకవేళ ఆమె తనకు చీర పంపిస్తే తాను తీసుకుని గౌరవప్రదంగా తన తల్లికి ఇస్తానని లోకేష్ తెలిపారు. అయితే చీర కట్టుకునే మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి రోజా మహిళా సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్‌లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు…
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని.. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అన్నారు. టీడీపీలో ఉన్నంతమంది ఉన్మాదులు దేశంలోనే లేరని రోజా ఆరోపించారు. మహిళ అని చూడకుండా మహిళా ఛైర్‌పర్సన్‌పై చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. రిషితేశ్వరిని పొట్టనపెట్టుకుంది టీడీపీ నేతలు కాదా అని మంత్రి…
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఎన్టీవీతో మంత్రి రోజా స్పందించారు. రుయాసంఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డ ఆమె.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డెడ్ బాడీకి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వాహనం ఇవ్వలేదని తెలిసిందని.. ఇది సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంవో బాధ్యత అని.. కానీ ఎలా మిస్ అయిందో తెలియదన్నారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను పంపించి నివేదిక ఇవ్వమని చెప్పినట్లు మంత్రి రోజా వివరించారు. ఇప్పటికే ఈ ఘటనలో సీఎస్‌ఆర్‌ఎంవోను సస్పెండ్ చేశామని.. ఆస్పత్రి…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. వైసీపీలో వర్గ వివాదాలు.. విభేదాలు.. గ్రూప్ పాలిటిక్స్‌కు నగరి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పంచాయితీలు పలుమార్లు వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. అయినప్పటికీ రివెంజ్ పాలిటిక్స్ కొదవ లేదు. నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే రోజా. సొంత పార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ సమస్య మరింత ముదిరి పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి…