విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి వేళ ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేశారు మంత్రి రోజా. ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను చూస్తే జాలేస్తోందన్నారు రోజా. ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా బాలయ్య ఆరోజుల్లో వుండి వుంటే.. జగన్ సీఎం అయినట్టే బాలయ్య కూడా కీలక పదవిలో వుండేవారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండేదన్నారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకత్వాన్ని చంద్రబాబు క్యాష్ చేసుకున్నారన్నారు. ఎన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వాళ్లే.. ఇప్పుడు ఫొటోకి దండం పెడుతున్నారని, మహానాడులో అయినా ఎన్టీఆర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని మంత్రి రోజా డిమాండ్ చేశారు. 14 ఏళ్ళు పట్టించుకోని చంద్రబాబుకి ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారన్నారు.
నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని బాలయ్యకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందన్నారు. ఇప్పుడు వున్నది నిజం అయిన టీడీపీ కాదన్నారు. నారా వారి టీడీపీ అన్నారు రోజా. టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించాక టీడీపీ నేతలు కళ్ళు తెరిచారన్నారు. ఇప్పటికైనా బావ చంద్రబాబు చుట్టూ తిరగడం మాని, ఎన్టీఆర్ కొడుకుగా బాలయ్య తన ఉనికిని చాటుకోవాలన్నారు రోజా. మహానాడులో సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. కానీ, సీఎం జగన్ పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారన్నారు.