కడప జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తనకు దేవుడు లాంటి వారని.. అందుకే ఆయన ఆశీస్సుల కోసమే ఇడుపులపాయ సందర్శనకు వచ్చినట్లు వివరించారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని మంత్రి రోజా పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని వైఎస్ఆర్ ఆహ్వానించారని.. కానీ అప్పుడు కుదరలేదని.. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ మీద…
ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్‌బ్రాండ్‌కు పూలు.. ముళ్లు తప్పవా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్కగా రాజకీయం ఉంటుందా? ఇన్నాళ్లూ ఆమెను ఫ్లవర్‌గానే చూసిన పార్టీలోని ప్రత్యర్థులకు ఇకపై ఫైర్ చూపిస్తారా? నగరి వైసీపీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారా? చిత్తూరు జిల్లాలోని వైసీపీ రాజకీయాలు ఒక తీరున ఉంటే.. నగరిలో మరోలా ఉంటాయి. అక్కడ నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ప్రస్తుతం మంత్రి అయ్యారు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా…