Roja Selvamani: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా తణుకులో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఎడ్లబండిని తోలుతూ ఉత్సాహంగా కనిపించారు. ఆమె ఎడ్లబండిని తోలిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.…
Minister Roja: జబర్దస్త్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ షో తరువాత రోజా ఎంతో ఫేమస్ అయ్యింది. ఒకానొక దశలో జబర్దస్త్ లేకపోతే తన జీవితం ఏమైపోయేదో అని కంటతడి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి.
Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం వచ్చిందంటే చాలు పవన్ కళ్యాణ్ వచ్చి అజ్ఞానంగా మాట్లాడిపోతాడని.. నిన్న దొంగ సర్వేల గురించి చెప్పాడని ఆరోపించారు. ఇలాంటి సర్వేల వల్లే గతంలో బొక్కబోర్లా పడ్డాడని.. తమకు 45 సీట్లు వస్తాయంటే.. ఆయనకు 130 వస్తాయా అని రోజా ప్రశ్నించారు. పవన్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని.. 2019లో ఆయన మాటే శాసనం అన్నాడని.. అసెంబ్లీపై జనసేన జెండా ఎగరేస్తానని చెప్పాడని..…
Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో…