Minister Narayana: వేస్ట్ టు ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా మంత్రి నారాయణ తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆధునిక ప్లాంట్లను సందర్శించారు. సోమవారం (జూన్ 9) రాత్రి ఆయన మహారాష్ట్రలోని పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ నగర చెత్తను ఆధారంగా చేసుకుని సుమారు 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.…
సింహపురి పాలిటిక్స్ సరికొత్తగా కనిపించబోతున్నాయా? పగ పగ అని రగిలిపోతూ....పంతం నీదా? నాదా? సై.... అంటున్న టీడీపీ కార్యకర్తల్ని మంత్రిగారు చల్లబరుస్తున్నారా అంటే అవునన్నదే పరిశీలకుల సమాధానం. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. రెండోసారి కేబినెట్ బెర్త్ దక్కినప్పటి నుంచి అటు అమరావతితో పాటు ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారట ఆయన. నెల్లూరు సిటీలో రోడ్లు, పార్కుల ఏర్పాటు, వైసీపీ హయాంలో…
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40 వేల ఎకరాలు అవసరం అవుతుందని అధారిటీ సమావేశంలో నిర్ణయించాం అన్నారు మంత్రి నారాయణ. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూటమిప్రభుత్వం ఒక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ‘తల్లికి వందనం’, ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకాలకు డేట్స్ ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పారు. మరోవైపు పాఠశాలలు మొదలుపెట్టే రోజున తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తామని ఆత్మకూరులో జరిగిన…
ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలి.. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ..
నేను మాటల మంత్రిని కాదు.. పనులు చేసి చూపించే మంత్రిని అని పొంగూరు నారాయణ పేర్కొన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనలో అభివృద్ధి కుంటపడింది అని మండిపడ్డారు.
Minister Narayana: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో జరిగిన కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడిస్తూ.. సీఆర్డీఏ 47వ ఆధారిటీతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కూడా జరిగిందన్నారు. 2014- 19లో గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కు సంబంధించి రూ. 514 కోట్ల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతారన్నారు అని వెల్లడించారు మంత్రి నారాయణ.. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళన నిన్న సీఎం దృష్టికి రైతులు తీసుకు వచ్చారన్నారు నారాయణ..
ఐదేళ్లపాటూ జగన్ తుగ్లక్ పాలనను అందించారని 2014 లో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపేశారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిలిపేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.64 వేల కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.
రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ఎవ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు నారాయణ.. వాణిజ్య వ్యాపార లావాదేవీలు జరగాలంటే భూమి అవసరం.. పెద్ద పెద్ద కంపెనీలు.. పరిశ్రమలు రావాలి.. అందుకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో రావాలి.. ఇందుకోసం అదనపు భూమి అవసరం.. కానీ, భూ సేకరణ చేస్తే రైతులకు నష్టం జరుగుతుందన్నారు..