Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వ పని తీరును ప్రజలే మెచ్చుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. జగన్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి రూ. 10 లక్షల కోట్ల అప్పులు వదిలి వెళ్ళడం.. ఏపీలో రూ. 85లక్షల టన్నుల చెత్తను వదిలేశారు.. ఏపీని స్వచ్ఛాంధ్రాగా మారుస్తున్నాం.. మచిలీపట్నంలో సీఎం ప్రకటన చేసిన విధంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మారుస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం.. పెన్షన్లను పెంచాం.. నిన్న ఒక్కరోజే రూ.10 వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా ఖాతాల్లో జమ చేశామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
Read Also: PM Modi: “సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ..
అలాగే, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నాం అని మంత్రి నారాయణ తెలిపారు. మహిళలకు ఆగష్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తాం.. అన్న క్యాంటీన్ ద్వారా రోజుకు 2 లక్షల 20 వేల మందికి ప్రతిరోజు భోజనం అందిస్తున్నాం.. ఏసీ రూమ్స్ లో కూర్చుని మాట్లాడటం కాదు.. రాజధానిలో జరుగుతున్న పనులు వచ్చి చూడాలని సవాల్ చేశారు. ఇక, జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, క్రిష్ణుంరాజుల వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని ఆయన ఆరోపించారు. టిడ్కో బాధితులను ఆదుకుంటాం.. ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించాం.. మరో మూడు నెలల్లో 3.50 లక్షల టన్నుల చెత్త తొలగిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో రోజుకు 2500 టన్నులు చెత్త ప్రాసెస్ చేయాలి.. కాంట్రాక్ట్ సంస్థ 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేస్తోంది అన్నారు. మరిన్ని అదనపు యంత్రాలు పెట్టి.. చెత్తను ప్రాసెస్ చేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.