Minister Narayana: వేస్ట్ టు ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా మంత్రి నారాయణ తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆధునిక ప్లాంట్లను సందర్శించారు. సోమవారం (జూన్ 9) రాత్రి ఆయన మహారాష్ట్రలోని పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ నగర చెత్తను ఆధారంగా చేసుకుని సుమారు 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
Read Also: Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!
అంతేకాకుండా, ప్లాంట్ ద్వారా బయోగ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మంత్రి నారాయణకు ఈ ప్లాంట్ పనితీరు, శక్తి వినియోగ విధానం, నిర్వహణ విధానాలను పూర్తిగా వివరించారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ప్లాంట్లను పరిశీలించి, వాటిలో బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయడం లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టారు.
Read Also: UEFA Nations League 2025: పోర్చుగల్ జట్టును నేషన్స్ లీగ్ విజేతగా నిలిపిన క్రిస్టియనో రోనాల్డో..!
ఈరోజు (జూన్ 10) మంత్రి నారాయణ ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరానికి చేరుకోనున్నారు. అక్కడి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, చెత్త నిర్వహణ విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఆయనతో పాటు స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి సహా పలువురు అధికారులు కూడా ఈ పరిశీలన పర్యటనలో భాగంగా పాల్గొంటున్నారు. ఈ సందర్శనలు రాష్ట్రానికి అనువైన, సమర్థవంతమైన మోడల్‌ను తీసుక వచ్చేందుకు కీలకంగా మారనున్నాయి.