మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. రానున్న మార్చి నాటికి మునిసిపాలిటీల పదవీకాలం పూర్తి కానున్నాయని అన్నారు. అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
సూపర్ సిక్స్‌లో 90 శాతం అమలు చేసేశామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు.
అమరావతి చాలా సేఫ్ సిటీ... ఇందులో అనుమానం లేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ.. ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. అమరావతి - నేలపాడులోని గెజిటెడ్ అధికారుల భవనాలు పరిశీలించారు.. క్లాస్- 4 ఉద్యోగుల క్వార్టర్లు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 13 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు.. అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోంది..…
ఒకటో తేదీ పండుగలా పెన్షన్ ల పంపిణీ సాగుతోంది.. ఒక్కరోజులోనే 99 శాతం పంపిణీ పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ లు ఇంటి దగ్గర ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందిపెట్టింది.. కానీ, విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో పెన్షన్ ల ప్రక్రియ గాడిలో పడిందన్నారు..
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి... వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. అమరావతి నిర్మాణంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. రాజధాని లో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘అమరావతి లో ఉన్న గ్రామ కంఠాల అభివృద్ధి కి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.. 904 కోట్లు 29 గ్రామాలకు కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.. నీటి సరఫరా…కు 64 కోట్లు…సీవరేజ్ కోసం 110 కోట్లు..రోడ్లు..కోసం..300 కోట్లు..కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. వచ్చే కేబినెట్ లో అనుమతి…
IGBC సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలు ప్రకటించారు.. అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నాం.. గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో 20 శాతం రాయితీతో పాటు డెవలప్మెంట్ చార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశం ఇచ్చాం అని వెల్లడించారు.. గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తారు.. IGBC ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్‌కు 10 శాతం, గోల్డ్ బిల్డింగ్ కు 15 శాతం, ప్లాటినం…
30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. డ్రైన్స్ కి అడ్డంగా నిర్మించిన ఇళ్లు తొలగించి.. టిడ్కో ఇళ్లు ఇచ్చేటట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. ఆగస్టు నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకంగా ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది.. ఈ ఒప్పందంపై మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు జరిగాయి.