Minister Nrayana: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 16 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 12 అంశాలకు ఉపసంఘం ఆమోదం తెలిపింది. భూములు కేటాయించిన సంస్థల పనితీరు, నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. గైయిల్ ఇండియా లిమిటెడ్ (GAIL India Ltd), అంబికా దర్బార్ బత్తి సంస్థలకు అప్పట్లో కేటాయించిన భూములు సరైన స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇకపై భూములు ఇచ్చిన సంస్థలకు ఖచ్చితమైన టైమ్‌లైన్స్ ఇవ్వబోతున్నామని, సూచించిన గడువులో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also:Gadwal Murder : పెళ్లైన తరువాత ప్రియుడితో 2000 ఫోన్ కాల్స్.. వెలుగులోకి కీలక విషయాలు
2019 ముందు భూములు కేటాయించబడిన 130 మంది నుంచి మిగిలిన కొందరే నిర్మాణాలు ప్రారంభించారని చెప్పారు. ఇప్పటివరకు భూములు కేటాయించుకున్న వారి నిర్మాణాల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. రానున్న ఆరు నెలల్లో వీరి పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఇప్పటివరకు అందించిన పనులన్నీ టేక్ ఆఫ్ అయ్యాయని, ప్రస్తుతం దాదాపు పదివేల మంది కార్మికులు అమరావతిలో పనుల్లో నిమగ్నమై ఉన్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
Read Also:Rohit Sharma: ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయా.. కుంబ్లేను కవర్ చేశా!