రేపు ( గురువారం) రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు అని మంత్రి నారాయణ తెలిపారు. కూల్చేసిన ప్రజావేదిక దగ్గర నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు.
Anna Canteens : ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దింతో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను మరోసారి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదవారికి కడుపు నిండనుంది. ఇందులో భాగంగానే తాజాగా పొరపాలక శాఖ మంత్రి నారాయణ ఓ కీలక ప్రకటన చేశాడు. వచ్చే మూడు వారాల్లో రాష్ట్ర…
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మూడు వారాల్లో అన్న క్యాంటీన్లని ప్రారంభించేలా కార్యాచరణకు మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగా రూ. 5కే అన్న క్యాంటీన్లల్లో భోజనం, టిఫిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 203 అన్న క్యాంటీన్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుమతించిందని, వీటిలో చాలా వరకు భవనాల నిర్మాణం జరిగిందన్నారు.
మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని.. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామన్నారు.
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో మంత్రి నారాయణ తన ఛాంబర్‌లోకి వచ్చారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్‌లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.