ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చామని.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.
అనధికారిక లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అనధికారిక లేఅవుట్ల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలోని మున్సిపాల్టీల పరిధిలో అనధికారిక లేఅవుట్ల వివరాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు.
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతోంది. జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
Minister Narayana: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతులతో అన్న క్యాంటిన్ లను ప్రారంభిస్తారు అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు నిర్వహించాం.
రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు, డ్రైన్లల్లో పూడిక తొలగింపుపై కమిషనర్లకు సూచనలు చేశారు మంత్రి నారాయణ. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరుపై మంత్ర్ నారాయణ ఆరా తీశారు. డ్రైన్లల్లో పూడిక తీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ…
Minister Narayana: రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు అని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు.. గత ఐదేళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు..
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా.. అప్పులు చేసి పెట్టింది.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ..
పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్లు ఈ పర్యటనకు వెళ్లారు. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది.
రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ లకు కొత్తగా నియమించబడిన కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. నగరాల్లో పార్కులు, సెంట్రల్ డివైడర్లు, రోడ్ల గుంతలు పూడ్చడం, డ్రెయిన్లలో పూడిక తొలగింపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు..