Minister Narayana: గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు. గత సర్కారు ఏపీ ఖజానాను ఖాళీ చేసిందని.. మళ్లీ పాలనా గాడినా పడాలంటే రెండేళ్లు పడుతుందన్నారు.
Read Also: CPI Naryana: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలి..
తిరుపతి టీడీఆర్ బాండ్ స్కామ్‌పై విచారణ కమిటీ వేశామని మంత్రి తెలిపారు. టీడీఆర్ బాండ్స్ వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందన తెలిపారు. త్వరలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో ఏపీలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్‌తో సులువుగా అనుమతి తీసుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. టీడీఆర్ స్కామ్‌పై విచారణ వేగవంతంగా జరుగుతోందని మంత్రి నారాయణ వెల్లడించారు.