ఏపీలో తుఫాన్ పరిస్థితులపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఉంటుందని సమాచారం వచ్చిందన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరానికి తాగునీటిని అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన విధానం. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక అందించేందుకు ఒక వ్యక్తితో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఈ నివేదిక…
వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు.
Minister Narayana: నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ పిల్లర్లకు అంటించిన పోస్టర్లను మంత్రి నారాయణ తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా అందంగా మారుస్తామన్నారు. గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం 90 శాతం విజయవంతమైంది అని తెలిపారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి నారాయణ మీద పెట్టినన్ని కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్న ఆయన.. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారని వెల్లడించారు..
Anil Kumar Yadav: నెల్లూరు సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి చాలా సురక్షితంగా ఉంది.. భవిష్యత్లో కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సురక్షితంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు మంత్రి నారాయణ.. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన ఆయన.. అనవసర ప్రచారం నమ్మవద్దు అన్నారు..
Minister Narayana: విజయవాడలో వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రిక ప్రాంతాల్లో ఇళ్ల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది.. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు..