Minister Narayana: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చామని.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. అమరావతి పనుల కోసం రూ. 5000 కోట్లు కూడా చెల్లించామన్నారు. లండన్ సంస్థ నార్మన్ పోస్టర్ వారితో డిజైన్ చేయించామని.. రూ. 36 కోట్లతో కంప తొలగింపు చేపట్టామని.. 50 శాతం తొలగించామని మంత్రి తెలిపారు. అమరావతిలో 4 నర్సరీలను డెవలప్ చేశామని.. అక్కడి చెట్లు చాలా పెద్దవి అయిపోయాయన్నారు.
Read Also: Andhra Pradesh: బదిలీలకు గైడ్ లైన్స్ జారీ చేస్తున్న వివిధ శాఖలు
అమరావతిలో 4 పెద్ద పార్కులు వుంటాయని మంత్రి నారాయణ వెల్లడించారు. శాఖమూరు సెంట్రల్ పార్కు 300 ఎకరాల్లో, అనంతవరం రీజినల్ పార్క్ 35 ఎకరాలు, మల్కాపురం 25 ఎకరాలు నర్సరీలు డెవలప్ చేశామన్నారు. 2 వాటర్ లేక్‌లు కూడా డెవలప్ చేస్తున్నామన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్లకు రెండు వైపులా బఫర్ జోన్ వస్తుందని.. అక్కడ ట్రీ ప్లాంటేషన్ కూడా చేస్తామన్నారు. మంచి వాతావరణం అమరావతిలో ఉండేలా చర్యలు ఉన్నాయన్నారు. టెండర్లు ఇంతవరకు చేసిన పనులతో క్లోజ్ చేస్తామన్నారు.
అమరావతి పనులు డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందన్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోయి 5 ఏళ్లు అయిందన్నారు. శాఖమూరిలోని అంబేద్కర్ స్మృతి వనం అంశం ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంబేద్కర్ స్మృతి వనం కోసం గతంలో టెండర్లు పిలిచామన్నారు. కొంతపని జరిగాక కూడా గత ప్రభుత్వం నిలిపేసిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.