విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కండ్రికలో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.
విజయవాడలోని విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి కండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీతో పాటు బుడమేరు ప్రవహించే మార్గాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు.
విజయవాడలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదలకు విజయవాడ వాసులు అతలాకుతలం అయ్యారు. కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు.. వారం రోజుల పాటు అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై పరిస్థితిని మాములు స్థితికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో గత పది రోజుల క్రితం వచ్చిన వరదలు.. తీవ్ర ప్రభావం చూపించాయన్నారు.
Minister Narayana: విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్యాక్ చేయించింది. సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు.
విజయవాడ వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. చీపురు చేత పట్టి పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు నారాయణ. నిర్దేశించిన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసి యజమానులకు అప్పగించాలని ఆదేశించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు…
విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించారు మంత్రి నారాయణ.
భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు గత రెండు రోజులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన కాకుండా మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఒక రూపాయి ఎక్కువైనా బాధితులకు ఆహారం మాత్రం కచ్చితంగా అందాలని…
విజయవాడ, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని.. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామన్నారు.
మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన అన్న క్యాంటీన్లను అక్టోబర్లో ఏర్పాటు చేస్తామన్నారు.
గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు.