భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు గత రెండు రోజులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన కాకుండా మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఒక రూపాయి ఎక్కువైనా బాధితులకు ఆహారం మాత్రం కచ్చితంగా అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, శానిటేషన్ కు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారు సీఎం చంద్రబాబు అని ఆయన అన్నారు. జగన్ ముందుగా వరద పై పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా.. ఇలాంటి పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలీకుండా మాట్లాడకూడదన్నారు మంత్రి నారాయణ.
IC 814: The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్ “IC 814 హైజాక్” సిరీస్ బ్యాన్ చేయాలని హైకోర్టులో పిల్..
సీఎం చంద్రబాబు తాను నిద్రపోవడం లేదు.. మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదని, గుంటూరు, భీమవరం, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రి మునిసిపాలిటీ ల నుంచీ వరద సహాయం పంపించారన్నారు మంత్రి నారాయణ. వరద బాధితులకు 6 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు, మంచినీళ్ళు అందిస్తున్నామని ఆయన తెలిపారు. వరద నీరు వెళ్ళిన ప్రతీచోటా హెల్త్, మునిసిపల్ సెక్రటేరీలతో క్లీనింగ్ మానిటర్ చేస్తున్నామని, బుడమేరు మాత్రమే కాదు.. ఎక్కడైనా సరే.. ఇళ్ళు పోయిన వారికి వేరే చోట ఇళ్ళు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే.. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచీ ప్రత్యేక వాహనాలలో వరద బాధితులకు ఆహారం పంపిణీకి సిద్ధం చేసారు మంత్రి నారాయణ.. ప్రతీ ఒక్కరికీ సహాయం అందేలా చూస్తున్నాం అంటున్నారు మంత్రి నారాయణ..
Jr. NTR : తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. ఎన్టీఆర్ కోటి విరాళం..