TDR Bonds: టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా అవసరమైన చర్యలను రిజిస్ట్రేషన్ శాఖ తీసుకోవాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ విభాగంతో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపకల్పన చేయాలని సూచనలు చేశారు. సర్వే నెంబర్లు, ఈసీలు, ఓనర్ షిప్ డాక్యుమెంట్లు జారీ పారదర్శకంగా ఉండేలా సాంకేతికంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Also: Teachers: వాగు దాటుతుండగా ఇద్దరు టీచర్లు మృతి.. వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం