Minister KTR: సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Fires On Singareni Privatization: సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధాని నరేంద్ర మోడీ కల్లబొల్లి మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు లోక్ సభలో కేంద్రం ప్రకటించిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పకూల్చడమే అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై అసూయతోనే.. ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతో సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ఆరోపించారు. తెలంగాణతో పాటు దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణిదే కీలక పాత్ర అని.. గనులు కేటాయించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను దివాలా తీయించిన విధంగానే సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్‌లోనూ సింగరేణి రికార్డ్ సృష్టిస్తోందని.. అలాంటి సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌కి మాత్రం మోడీ గనులు కేటాయించుకున్నారని పేర్కొంటూ.. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి కేటాయించిన గనుల తాలూకు పత్రాలను కేటీఆర్ విడుదల చేశారు. ‘‘సొంత రాష్ట్రం గుజరాత్‌కి ఒక నీతి, తెలంగాణకి మరొక నీతిని అమలు చేస్తున్నారా? దీనిపై మోడీ స్పష్టత ఇవ్వాలి’’ అని నిలదీశారు. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులు? అని ప్రశ్నించారు. ఇది ఒక్క సింగరేణి కార్మికుల సమస్య కాదని.. సమస్త తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని కేటీఆర్ అన్నారు. సింగరేణి తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అని.. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై.. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!