\Minister KTR Serious: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామ యువతి కిడ్నాప్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను జ్యోతి కిడ్నాప్ విషయంపై వివరాలు కేటీఆర్ అడిగారు. జిల్లాలో శాంతి భద్రతలపై ఆరా తీశారు. మూడపల్లి యువతి కిడ్నాప్ నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టం అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే.. రాజన్న సిరిసిల్లా జిల్లాలో శాలిని కిడ్నాప్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కిడ్నాప్ చేసిన జాన్‌కి, శాలినికి ఇదివరకే పెళ్లి అయ్యింది. అయితే.. శాలిని మైనర్ కావడం, ఈ పెళ్లి కూడా ఇష్టం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులకు కేసు పెట్టారు. ఈ కేసులో జాన్ పది నెలల జైలు శిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జాన్ మళ్లీ శాలినికి దగ్గర అవుతుండడంతో.. తల్లిదండ్రులకు ఆమెకు మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్.. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపాడు. తెల్లవారుజామున ఆలయంలో పూజ ముగించుకొని శాలిని బయటకు రాగానే.. ఆమె తండ్రి ముందే తన స్నేహితుల సహకారంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శాలిని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారలపై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్
అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు శాలిని తన తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లింది. పూజ ముగించుకొని బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ తన స్నేహితులతో మాటువేసిన జాన్.. శాలిని బయటకు రావడం గమనించి, వెంటనే కార్ వేసుకొని ఆలయం ముందుకు వచ్చాడు. బలవంతంగా ఆమెని కారులో ఎక్కించుకున్నాడు. తండ్రి ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు కానీ, జాన్ స్నేహితులు ఆయన్ను అడ్డుకున్నారు. అటు శాలిని పారిపోవడానికి ప్రయత్నించగా, మరో యువకుడు ఆమెని పట్టుకొని కారులో ఎక్కించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. జాన్‌కి ఎవరెవరు సహకరించారు? ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యుంది? వీళ్లంతా ఎక్కడికి వెళ్లి ఉంటారు? అనే కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.