Minister KTR On Cess Election Result: వేములవాడ సెస్ ఎన్నికల్లో తమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సెస్ ఎన్నికల ఫలితాలతో బీజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారు. అడ్డదారుల్లో గెలుపు కోసం బీజేపీ చేసిన కుటిలప్రయత్నాలను ప్రజలు ఓటుతో వమ్ము చేశారన్నారు. సెస్ ఎన్నికలను సాధారణ ఎన్నికల మాదిరి మార్చి.. విచ్చలవిడి డబ్బులతో, ప్రలోభాలతో ప్రజలను మభ్య పెట్టాలనుకున్న బిజెపి ప్రయతాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని మరోసారి ప్రజలు తేల్చి చెప్పారన్నారు. సెస్ ఎన్నికల్లోని బీజేపీ ఓటమి.. తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి పట్ల నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కారభావానికి నిదర్శనమని తెలిపారు. సెస్ ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ
ఇదిలావుండగా.. సెట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్న కేంద్రం వద్ద కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల అధికారులు పరోక్షంగా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారుల ముందే ఇరువర్గాలు గొడవకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. కొందరు బీజేపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటు.. ఫలితాల విషయానికొస్తే, మొత్తం 15 డైరెక్టర్ స్థానాల్లో 13 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరో రెండు స్థానాల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ సెస్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి, బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజు మధ్యే తీవ్ర పోటీ సాగింది.
Nikhat Zareen: నేషనల్ బాక్సింగ్ ఛాంప్‌గా నిఖత్.. ఫైనల్స్‌లో ఘనవిజయం