తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. BRS పార్టీ లో KTR ఏందో మాకు తెలియదు. BRS నేతలు అబద్ధాలు మీద అబద్ధాలు చెబుతున్నారు… రైతు దినోత్సవం రోజున నిరసన కార్యక్రమాలు చేశారు. రైతులకు రైతు కూలీలకు తేడా తెలియని వ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు ప్రకాష్ రెడ్డి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కల్లాలు నిర్మిస్తున్నామని కేంద్రం దృష్టికి తీసుకెళ్ల లేదు. బిజెపి రైతు వ్యతిరేకి అని రాజకీయ దిగజారుడు పనిని BRS చేస్తుందన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు కేటీఆర్ చేస్తున్నారని తీవ్రమంగా మండిపడ్డారు.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ.. తన నియోజక వర్గంలో నిర్మించిన ఒక స్కూల్ ని చూపించి తెలంగాణ అంతా ఇలానే ఉందని చెబుతున్నాడు కేటీఆర్. స్కూల్స్ లో సరైన సౌకర్యాలు లేక, టీచర్ లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. సరూర్ నగర్ జూనియర్ కాలేజీ లో టాయిలెట్లు లేక అమ్మాయిలు పడ్డ కష్టాలు మీ దృష్టికి రాలేదా కేటీఆర్? అని సంగప్ప ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూల్స్ లో టాయిలెట్స్ లేని స్కూల్స్ లో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. స్కూల్స్ లో స్కావెంజర్ లు లేరు…. అధ్వాన్న పరిస్థితి నెలకొని ఉందన్నారు. అన్ని నియోజక వర్గాల్లో విద్యాలయాలను కట్టించిన తర్వాత ట్వీట్ చెయ్యి కేటీఆర్ అని ఎద్దేవా చేశారు సంగప్ప.
Read Also: Richard Verma: బైడెన్ పరిపాలనలో మరో భారత-అమెరికన్‌కు అందలం..
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యారంగం మీద బడ్జెట్ ప్రతి ఏడాది తగ్గిస్తూ వస్తుంది ప్రభుత్వము. స్కూల్స్ లలో వేలాది టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి…తెలంగాణ GSDP లో అతి తక్కువ ఖర్చు కేటాయిస్తుంది. అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ తెలంగాణలోనే ఉందన్నారు కిషోర్.
Read Also: IND Vs BAN: హడలెత్తిస్తున్న బంగ్లాదేశ్.. రెండో టెస్టులో కష్టాల్లో టీమిండియా