Revanth Reddy Letter To Governor Tamilisai On TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సిట్ విచారణ ద్వారా ప్రవీణ్ కుమార్, రాజశేఖర రెడ్డి దోషులుగా చూపబడ్డారని.. ఇతరులతో పాటు ఆ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. ఆ ఇద్దరి వద్ద పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని ప్రశ్నాపత్రాలు లభ్యమైనట్లు గుర్తించి, వాటిని అసంఖ్యాక అభ్యర్థులకు విక్రయించినట్లు తేలిందన్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ ‘‘ఇది ఇద్దరు వ్యక్తుల పొరపాటు మాత్రమేనని, వ్యవస్థాగత లోపం కాదు’’ అని అనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ స్కామ్‌ను ఇద్దరు వ్యక్తుల సాధారణ పొరపాటుగా కప్పిపుచ్చడానికి మంత్రి తన వంతు కృషి చేస్తున్నారని ఆరోపించారు. TSPSC గత 8 ఏళ్లుగా గణనీయమైన సంస్కరణలు చేసిందని మంత్రి పొగడడాన్ని చూస్తే.. మొత్తం ఎపిసోడ్‌ను తక్కువ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్న లక్షలాది మంది యువత స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. ఇప్పటికే నిర్వహించిన కొన్ని పరీక్షలను రద్దు చేయాలని, మరికొన్ని పరీక్షలను వాయిదా వేయాలని TSPSC నిర్ణయించిందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ చేసిన ఎంపికల విశ్వసనీయతపై కూడా ప్రభుత్వ తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. TSPSC ప్రభుత్వ సంస్థ విశ్వసనీయతపై యువతలో విశ్వాసం లోపించిందన్నారు.
Russian Drone Attack: కీవ్‌లోని ఓ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు దుర్మరణం
రాజశేఖర్ రెడ్డి జగిత్యాల జిల్లాకు చెందినవాడని.. ఈ జిల్లాలోని మల్యాల మండలానికి చెందిన దరఖాస్తుదారులు గ్రూప్ I ప్రిలిమినరీ పరీక్షలో అత్యధిక మార్కులు పొందినట్లు నివేదించబడిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రవీణ్ కుమార్ కూడా అదే పరీక్షలో 100 కంటే ఎక్కువ మార్కులు సాధించినట్లు చైర్మన్, TSPSC ధృవీకరించారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ పరీక్షలో గరిష్ట సంఖ్యలో TSPSC అభ్యర్థులు కూడా విజయం సాధించినట్లు తేలిందన్నారు. 2016 గ్రూప్-I ఎంపిక ఫలితాలు కూడా అసాధారణతలను కలిగి ఉన్నాయని, USA నుండి నేరుగా పరీక్షలకు వచ్చిన ఒక అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో మొదటి ర్యాంక్‌ను పొందారని గుర్తు చేశారు. TSPSCకి చెందిన ఒక ఉద్యోగి అదే ఏడాది గ్రూప్ I ఎంపికలలో 4వ ర్యాంక్ పొందినట్లు తెలిపారు. గ్రూప్-2 పరీక్షలో ఒకే సెంటర్‌లో పరీక్షలు రాసిన 25 మంది అభ్యర్థులు పోస్టులకు ఎంపికయ్యారని.. TSPSC స్కామ్‌లో ఐటీ మంత్రి పేషీ నుంచి పనిచేస్తున్న వ్యక్తుల నేరాన్ని ఇవన్నీ రుజువు చేస్తున్నాయని చెప్పారు. తన తండ్రి మరణంతో స్టేట్ ప్రింటింగ్ ప్రెస్‌లో పోస్టింగ్ పొందిన ప్రవీణ్ కుమార్.. TSPSCలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి అనుమతించబడటం, వెంటనే సెక్షన్ ఆఫీసర్, అనంతరం PA నుండి సెక్రటరీ, TSPSCలో పదోన్నతలను తక్కువ వ్యవధిలోనే పొందడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని.. కేటీఆర్ & ఆయన వ్యక్తిగత సిబ్బంది ద్వారా ప్రవీణ్ కుమార్ ఈ కీలకమైన స్థానాన్ని పొందారని గట్టిగా నమ్ముతున్నామని చెప్పుకొచ్చారు.
Teacher Beaten By Parents: ఉపాధ్యాయుడిని చితక్కొట్టిన పేరెంట్స్.. కారణమేంటంటే..
కేటీఆర్‌తో TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డికి అనుబంధం ఉందని.. ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయడంలో జరిగిన ఎపిసోడ్‌లో కనీసం 23 మంది యువ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆ లేఖలో వెల్లడించారు. ఒక సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన ప్రమోటర్లు నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఈ దారుణమైన సంఘటన జరిగిందన్నారు. ఈ ఎపిసోడ్‌ను కప్పిపుచ్చేందుకు అప్పటి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం రంగంలోకి దించిందని.. అతడు 23 మంది విద్యార్థుల ఆత్మహత్యలను పట్టించుకుకుండా సాఫ్ట్‌వేర్ సంస్థ తప్పులను కప్పిపుచ్చారని.. ఇలాంటి జనార్దన్ రెడ్డికి TSPSC ఛైర్మన్‌గా పోస్టింగ్ అనేది కేటీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని ఆరోపణలు చేశారు. రెండో ముద్దాయి రాజశేఖర్ రెడ్డి TSTSలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కావడం, అది మళ్లీ ఐటీ మంత్రిచే నియంత్రించబడుతుండటం, ఏడేళ్లుగా TSPSCలో ఎటువంటి మార్పు లేకుండా ఈ సున్నితమైన అసైన్‌మెంట్‌ను నిర్వహించడం.. ఈ కేసులోని ముఖ్యాంశంగా పేర్కొన్నారు. ఈ ప్లేస్‌మెంట్, హై సెక్యూరిటీ ఎగ్జామ్ పేపర్‌లకు యాక్సెస్ ద్వారా ఇప్పటివరకు చేసిన ఎంపికలకు లోతైన అనుమానాలను కలిగి ఉందని ఇది రుజువు చేస్తుందన్నారు. అలాగే ఏడేళ్లుగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో పనిచేస్తున్న శంకర లక్ష్మి పాత్రపై కూడా విచారణ జరగాలి.. ఎందుకంటే స్కామ్‌లో భాగంగా ఆమె రాజశేఖర్ రెడ్డికి పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేయడానికి ఆమె అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.
Blast at Cracker Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం
ఈ కేసులో సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఐటీ మంత్రి కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ శ్రీమతి అనితా రామచంద్రన్‌లు బాధ్యులుగా చేయాలన్నారు. అనేక పోటీ పరీక్షలకు సంబంధించిన TSPSC పరీక్షా పత్రాల లీకేజీని నిర్వహించడంలో.. వారి నీచమైన, అవినీతి ఉద్దేశ్యాలతో తెలంగాణ యువత భవిష్యత్తును నాశనం చేయడంలో TSPSC వారి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది మధ్యప్రదేశ్‌లో మెడికల్ అడ్మిషన్లలో అవకతవకలతో కూడిన వ్యాపమ్ కుంభకోణానికి దారితీయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ప్రాసిక్యూషన్‌ను ఆమోదించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని.. ఇద్దరు మంత్రులను ప్రాసిక్యూట్ చేసేందుకు మధ్యప్రదేశ్ గవర్నర్ అనుమతిని మంజూరు చేశారని గుర్తు చేశారు. అయితే.. మంత్రి మండలి దాన్ని అడ్డుకుందన్నారు. మంత్రి కేటీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌లను కుట్రలు చేసి మోసగించినందుకు.. వారిని విచారించేందుకు అనుమతిని మంజూరు చేయాలని కోరారు. రాజ్యాంగంలోని 317 ప్రకారం అధికారాలను ఉపయోగించాలని, TSPSC ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్ మూలాన్ని విచారించడానికి, ప్రజా జీవితంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి.. ఈ సమస్యను సీబీఐ & ఈడీలకు సూచించాలని రేవంత్ ఆ లేఖలో కోరారు.
Bandi Sanjay: మరో ఆందోళనకు సిద్ధం.. ఈనెల 25న నిరుద్యోగ మహాధర్నా