Minister KTR: బండి సంజయ్ ఒక దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని.. కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Fires On Bandi Sanjay Over TSPSC Leak Issue: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని మంత్రి కే. కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితం అనే కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహన లేకుండా.. బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం.. బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు.. ధరణి పోర్టల్, టీఎస్‌పీఎస్‌సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారన్నారని, అయినా అతనికి బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు.. రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Virat Kohli: నాటు నాటు స్టెప్ వేసిన విరాట్.. నువ్వు కూడా హీరో అయిపో అన్నా
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని.. ఆ లీకేజీల్లో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లోనే 8 ఏళ్లలో 13 సార్లు ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగిందని.. మరి కుంభకోణాలపై ఏమంటావని బండి సంజయ్‌ని సూటిగా నిలదీశారు. ఈ లీకేజ్‌లపై మోడీని బాధ్యున్ని చేసి, ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే.. తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయన్నారు. అక్కడ పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ, ముఖ్యమంత్రిని కానీ బీజేపీ ఏనాడూ బాధ్యులను చేయలేదని చెప్పారు. బీజేపీ నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలో.. బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసన్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో జరిగితే ఒకలా.. ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహరించడం.. బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ కు నిదర్శనమని అన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా లోపం జరిగితే.. ప్రభుత్వం వెంటనే ఎంత వేగంగా స్పందించి, ఎలాంటి చర్యలు తీసుకుందనేదే ముఖ్యమని, దాన్ని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం మెరుపువేగంతో సిట్‌ను నియమించి, బాధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు.
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఒకవైపు ప్రభుత్వం స్పందించిన పారదర్శక తీరును పట్టించుకోకుండా.. మొత్తం వ్యవహారాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తోందని, ఈ దుర్మార్గమైన ప్రయత్నాన్ని మానుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. తమ స్వార్ధ రాజకీయాలకు సమాజంలో చిచ్చుపెట్టే అలవాటు బీజేపీకి కొత్త కాదని, ఈ వ్యవహారాన్ని సైతం శాంతి భద్రతల సమస్యగా మార్చే కుట్ర చేస్తోందని అన్నారు. ఓవైపు విద్యార్థులు కోటి ఆశలతో పరీక్షలకు సిద్ధమవుతుంటే.. పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలని విద్యార్థుల్ని దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్ అని, అసలు యువత గురించి మాట్లాడే అర్హత అతనికి లేదని తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి, మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్‌నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందన్నారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, ఈ పేపర్ ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదేనని అన్నారు. నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే.. బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు ఆరోపించారు. ఇలా రాజకీయాల కోసం యువత భవితతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటి మోసగాళ్ల పట్ల యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!