ఫెడ్ ఎక్స్ ఒక్క సంస్థ ఏడు వేల ఉద్యోగాలు సృష్టించిందని, గతేడాది లో లక్ష 50 వేల ఉద్యోగాలు సంవత్సరం వచ్చాయని, 2021 లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లని తెలిపారు. 2030 వరకు 250బిలియన్ డాలర్లు అనుకుంటున్నామని, ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తామని, కేసులు, జైళ్లు మాకు కొత్త కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది.
వేరేటోళ్ళను పొరపాటున నమ్మినా తెలంగాణ మళ్ళీ వెనక్కి వందేళ్లు వెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ అంటే భారత్ రైతు సమితి అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని తెలిపారు.