ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. అయితే ముందుగా ఈ నెల 4న ఉదయం 11 గంటలకే ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం వీలు కాలేదు.…
ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 6న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తొలుత శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. Devineni Uma : ఆ విషయంలో జగన్…
వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు పోలీస్ ఐలాండ్ సెంటర్ లో విగ్రహాలకు నివాళులు అర్పించి మూడో రోజు యాత్రను మంత్రులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్టీవో మాట్లాడుతూ… చంద్రబాబుకు ఎప్పుడూ శాపనార్థాలు పెట్టడం మినహా ఇంకేం వచ్చు అంటూ ఆయన ధ్వజమెత్తారు. రోజూ మాట్లాడిన విషయాలు కాకుండా చంద్రబాబు కొత్తగా ఏమైనా చెప్పాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మనసులో జగన్ దూరిపోయి చెప్పాడా…
పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేస్తున్నాం బొత్స 14 సంవత్సరాల అధికారంలోకి చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. రెండు…
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తప్పు పట్టారు. ఆయన్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పిన ఆయన, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే జగన్ ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులందరూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే నారాయణ అరెస్ట్‌కు తెరలేపారని చెప్పారు. అసలు ఏ కేసులో…
అమరావతిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రి బొత్స అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉండటం ఒక గౌరవం అని అభిప్రాయపడ్డారు. ఏపీలో సీఎం జగన్ సంక్షేమంతో…
ఏపీలో టెన్త్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీక్‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, పేపర్ లీక్‌ల వ్యవహారంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం, విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురి కావొద్దు, ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షలపై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.. పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. Read…
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, కరెంట్ లాంటి సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి.. దీంతో, కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ మంత్రలు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన.. చాలా సున్నితమైన అంశం, కేటీఆర్ చెప్పినట్టు అయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా? అని ప్రశ్నించారు. ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు.. నేను హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా.. అక్కడ కరెంటే లేదు, నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని…
విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC…