ఏపీలో టెన్త్ పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాల లీక్‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, పేపర్ లీక్‌ల వ్యవహారంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం, విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురి కావొద్దు, ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షలపై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నాం.. పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Read Also: Vidadala Rajini: జీవితాంతం సీఎం జగన్‌కు తోడుగా బీసీలు..!
టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించి అరెస్టు చేశామని వెల్లడించారు మంత్రి బొత్స.. పరీక్షా పత్రాలు మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన.. అడ్డంగా దొరికిపోయిన నారాయణ, ఇతర విద్యా సంస్థల గురించి అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ నిలదీశారు. విద్యార్దులకు సంబంధించిన అంశంలో రాజకీయాలు జొప్పించొద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షలు, పేపర్ లీక్‌లపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని విద్యార్థులు పట్టించుకోవద్దు.. ప్రశాంతం పరీక్షలు రాయాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.