వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు పోలీస్ ఐలాండ్ సెంటర్ లో విగ్రహాలకు నివాళులు అర్పించి మూడో రోజు యాత్రను మంత్రులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్టీవో మాట్లాడుతూ… చంద్రబాబుకు ఎప్పుడూ శాపనార్థాలు పెట్టడం మినహా ఇంకేం వచ్చు అంటూ ఆయన ధ్వజమెత్తారు. రోజూ మాట్లాడిన విషయాలు కాకుండా చంద్రబాబు కొత్తగా ఏమైనా చెప్పాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మనసులో జగన్ దూరిపోయి చెప్పాడా ముందస్తు ఎన్నికలకు వెళతానని.. లేకపోతే దేవుడు కలలోకి వచ్చి చెప్పాడా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతేకాకుండా ముందస్తు ఎన్నికల కోసం చంద్రబాబు ఆత్రుత పెడుతున్నాడని, వ్యవసాయానికి మీటర్లు దేనికి పెడతామంటున్నాం?? రైతులు విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు బాధ్యత కూడా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు గజదొంగ, బందిపోటు దొంగ అని శ్రీకాకుళం ప్రజలు అందరికీ తెలుసంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ మహానాడుకు నియోజకవర్గ స్థాయి సభకు వచ్చినంత మంది కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు.