Minister Botsa: మధురవాడ భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC స్టేటస్ కో తెచ్చుకుందన్నారు. టీడీపీ హయాంలో ఈ భూముల రెగ్యులరైజేషన్ కోసం టుమెన్ కమిటీని వేసిందని.. వేల్యూషన్ చేయించి NCCకి విక్రయించేందుకు కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయిస్తే స్టాంప్ డ్యూటీ ఎక్కువ అవుతుందన్న NCC రిక్వెస్ట్ ఆధారంగా జీపీఏకు చంద్రబాబు అనుమతి ఇచ్చారన్నారు.
బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే గత ప్రభుత్వంలో ద్విసభ్య కమిటీ నిర్ధారించిన రేటు ప్రకారం NCCకి ఇచ్చేందుకు జీవో నెంబర్ 67 జారీ చేశామని బొత్స వెల్లడించారు. జీవో నెంబర్ 67ప్రకారం మొత్తం భూమి నిమిత్తం 197కోట్ల రూపాయలు NCC కంపెనీ చెల్లించిందన్నారు. ఈ లావాదేవీలు అన్నీ గత ప్రభుత్వం, చంద్రబాబు హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కేటాయింపులు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్నీ జీవోలు అందుబాటులో ఉన్నాయని.. దోపిడీకి ప్రయత్నం చేసి ఇప్పుడు టీడీపీ నాయకులు నంగనాచుల్లా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీ.ఆర్.పీ.ఎల్. కంపెనీతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటాయింపులు జరిగింది NCC వైజాగ్ అర్బన్ డవలపర్స్ కంపెనీకి మాత్రమేనన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో స్టాంప్ డ్యూటీ నిబంధనలు ఉల్లంఘన జరిగిందా.. లేదా అనేది అధికారులతో సమీక్షిస్తామన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా ప్రాజెక్టు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని బొత్స తెలిపారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
https://ntvtelugu.com/entrance-tests-dates-confirmed-by-andhra-pradesh-higher-education-department/
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!