మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. చాలా ఆశలతో చర్చలకు వచ్చిన తమకు సర్కారు పాత విషయాలనే చెప్పిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం జీపీఎస్‌పైనే చర్చించాలని చెప్పిందని ఉద్యోగులు తెలిపారు.
CPS Employees: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శాతవాహన కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహణకు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్లలో ఏదో ఒక చోట ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశంపై…
CJI NV Ramana: గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా డాక్టరేట్, మాస్టర్ డిగ్రీలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన వారికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో వీసీ పట్టాలు అందించారు. అటు సీజేఐ ఎన్వీ రమణకు నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గౌరవ డాక్టరేట్ పట్టాను జస్టిస్ ఎన్వీ రమణకు యూనివర్శిటీ ఛాన్సిలర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అందజేశారు.…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా టీచర్ల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు గందరగోళం సృష్టిస్తోంది.. హాట్ టాపిక్‌గా మారిన ఈ యాప్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీచర్లు స్కూళ్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఫొటో దిగడం.. పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.. అయితే, ఆ యాప్‌లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్,…
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో 1986 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయని.. నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని.. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండాలని ముందు రాలేదని సీఎం చెప్పారని గుర్తుచేశారు.. ఇక, 3.60 లక్షల మందిని పునరావాస కేంద్రాల్లో ఉంచాం, ఇప్పటికీ సహాయక చర్యలు…
ఒక క్లాస్ కు ఒక టీచర్ కాకుండా కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌కు ఒక టీచర్ విధానం తీసుకుని వస్తున్నాం.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూనే కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు నా నియోజకవర్గానికి వెళ్ళి… నేను వ్యక్తిగతంగా పనికి మాలిన వ్యక్తి అన్నట్లు మాట్లాడాడరు.. పనికి మాలినతనానికి చంద్రబాబుదే పేటెంట్ హక్కు అని.. ప్రపంచంలో చంద్రబాబు కంటే పనికి మాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? రాష్ట్రానికి సంబంధించి ఒక్కటైనా పనికి వచ్చే విషయం మాట్లాడారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ఏపీ సర్కార్-బైజూస్ ఒప్పందంపై చంద్రబాబు చేసిన కామెంట్లుకు…
నిన్న పదో తరగతి ఫలితాల్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే! పాస్ శాతం పక్కనపెడితే.. మార్కుల జాబితాలో కొన్ని అవకతవకలు కనిపించాయి. చాలామంది పిల్లలకు పాస్ మార్కులు రాకపోయినా, పాస్ చేసేశారు. వేరే వాళ్ళకు అంతకుమించి మార్కులు వచ్చినా (పాస్ అర్హత కంటే తక్కువే), ఫెయిల్‌గా ప్రకటించారు. దీంతో.. ‘‘ఏంటీ తప్పుల తడక’’ అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా…