ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. అయితే ముందుగా ఈ నెల 4న ఉదయం 11 గంటలకే ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించింది.
అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం వీలు కాలేదు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి.. ఓ గంట ఆలస్యంగానైనా ఫలితాలను విడుదల చేయాలని యోచించిన విద్యాశాఖ.. సాంకేతిక లోపం పరిష్కారం కాకపోవడంతో సోమవారానికి ఫలితాల విడుదలను వాయిదా వేసింది. ఈ క్రమంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.