పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేస్తున్నాం బొత్స 14 సంవత్సరాల అధికారంలోకి చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. రెండు నెలల క్రితం రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బొత్స రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని, టీడీపీ హయాంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.
విజయనగరంలో సంతకాల వంతెన లాంటి నిర్మాణలు టీడీపీ హయాంలో జరిగితే ఒక్క రోడ్డు నిర్మాణం కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదని, టాక్స్ నెట్ వర్క్ లో జె టాక్స్ పేరిట ప్రజలపై పన్నుల భారం మోపింది వైసీపీ ప్రభుత్వమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఎంత కసిగా ఉన్నరో ఆర్థం అవుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రెట్రోలు డీజిల్ ధరలు తగ్గించిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.