మైక్రోసాఫ్ట్‌లో కీలక హోదాలో ఉన్న లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం లీసా మోనాకో మైక్రోసాఫ్ట్‌లో గ్లోబల్ అఫైర్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో జాతీయ భద్రతా సీనియర్ సలహాదారుగా కూడా విధులు నిర్వర్తించారు.
H-1B visa: విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ. 88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.
Microsoft Layoffs: టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు తెలుస్తుంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు ప్రకటించడం ఇది సెకండ్ టైమ్.
మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగుల తొలగింపులకు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా తమ సిబ్బందిలో దాదాపు 3 శాతం మేర ఉద్యోగుల లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది.
Microsoft Layoffs 2025: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రెడీ అవుతుంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కోతలు విధిస్తున్నట్లు సమాచారం.
Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతికి చెందిన ఒక ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్‌కి సాంకేతిక సహాయం చేశారని వానియా అగర్వాల్ అనే టెక్కీ ప్రశ్నించింది. ఇజ్రాయిల్ సైనిక చర్యలలో మైక్రోసాఫ్ట్ భాగస్వామి అని ఆమె ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ బాస్‌లు సత్య నాదెళ్ల, స్టీవ్ బాల్మెర్, బిల్ గేట్స్ ముగ్గురూ ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి ఆగ్రహంలో వీరంతా ఒకింత…
స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్‌ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్‌ఫామ్‌గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది.
హైదరాబాద్ జర్నీలో ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతాం అని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్‌షిప్ టీమ్‌కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.