CM Revanth Reddy: హైదరాబాద్‌ను ఇలానే వదిలేద్దామా.. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం ఎందుకు..?
- గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..
- ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పని చేస్తున్నాయి..
- హైదరాబాద్‌ను ఇలానే వదిలేస్తామా?, మూసీ ప్రక్షాళన కొందరికి నచ్చడం లేదు.. ' న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో పోటీ.. సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి వచ్చాం: సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలనకు ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీలో భాగంగా 30 కోట్లు ఈ భవన నిర్మాణానికి అపర్ణ కన్స్ట్రక్షన్ కేటాయించిందన్నారు. నిజాం నవాబులు 400 ఏళ్ల చరిత్ర ఉన్న నగరంలో నిర్మించారు.. మాదాపూర్, కొండాపూర్, వట్టి నాగులపల్లి వరకు అభివృద్ధి చేసేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యమంత్రులు కృషి చేశారు.. ప్రపంచంలోని 500కు పైగా కంపెనీలు ఇక్కడే ఉన్నాయి.. ఆనాడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేశారు.. పీవీ నర్సింహారావు స్పెషల్ ఎకనామిక్ జోన్ ను మంజూరు చేశారు.. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Mrunal Thakur : నా దృష్టిలో సక్సెస్ అంటే.. తృప్తిపరచడమే
Also Read
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ అభివృద్ధి..
మరోవైపు, చిన్న చిన్న వర్షాలకే హైదరాబాద్ నగరం మునిగిపోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే కొందరు వద్దని అంటున్నారు.. ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా.. ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్ ను నిలుపుకుందామా? వద్దా అని ప్రశ్నించారు. ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో హైదరాబాద్ కు ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది.. మనం న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడాలి.. చిత్తశుద్ధితో సాధిస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కాబట్టి, వరిజిబాల్ సిటీని గోల్డెన్ సిటీ చేయాలంటే మూసీ ప్రక్షాళన చేసి తీరాలి.. మనకు నదుల ప్రక్షాళన అవసరం.. గంగా, యమున, సబర్మతి నదులను ఆయా రాష్టాలు ప్రక్షాళన చేశాయి.. మనం కూడా మూసీని ప్రక్షాళన చేసుకోవాలన్నారు. పేదల కోసం స్థలాలు వెతకమని మంత్రులకు చెబుతున్నా.. వారికి ఇల్లు కట్టి ఇద్దాం.. సొంత ఇల్లు కళ నెరవేరాలంటే నగరం విస్తరించాలి.. మూసీ విస్తరించాలి.. రాత్రుళ్ళు అక్కడ బిజినెస్ నడవాలి.. నైట్ ఎకానమిని మూసీలో సృష్టించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
Read Also: Gold Price Today: ఇది కదా కావాల్సింది.. నేడు కూడా భారీ తగ్గింపు!
సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి వచ్చాం..
అయితే, గత ముఖ్యమంత్రుల దూరదృష్టితో హైదరాబాద్ కి అనేక అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఇప్పుడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీని శాసిస్తున్నాం.. మన వాళ్ళు ఒక్క రోజు పని చేయకపోతే అమెరికా కుప్పకూలిపోతుంది. కాగా, తెలంగాణ రైజింగ్ 2047 అంటున్నాం.. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఎదగాలని చెప్పుకొచ్చారు. ఇక, సంవత్సరానికి 15 వేల కోట్ల ఆదాయం ఇచ్చే రిజిస్ట్రేషన్ శాఖ బంగారు గుడ్డు పెట్టె బాతు.. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి ఆదాయం తెచ్చి పెడుతున్న వారిని దొంగలుగా చూస్తున్నారు.. నేరం చేసే వాళ్ళ మాదిరిగా రిజిస్ట్రేషన్ కు వచ్చే వాళ్ళను చూసే పరిస్థితి మారాలని సీఎం సూచించారు.
Read Also: Mokshagna Nandamuri : బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
8 నెలల్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల నిర్మాణం
కాగా, అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉంటాయని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రభుత్వం మీది.. మీకు వసతులు కల్పించడం వల్ల మంచి పేరు వస్తుంది.. 144 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నాం.. విదేశాల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు మంచి పేరు ఉంది.. అన్ని ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలి.. 2034లో ప్రపంచం హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా చూడడానికి రావాలి.. అన్ని విభాగాలు అక్కడి నుంచే పని చేయాలని వెల్లడించారు. ఇక, జూన్ 2వ తేదీ లోపు 11 ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు పూర్తి చేయాలి.. కేవలం 8 నెలల్లోనే అపర్ణ కన్స్ట్రక్షన్ వారు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు నిర్మాణం పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!