మైక్రోసాఫ్ట్‌లో కీలక హోదాలో ఉన్న లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం లీసా మోనాకో మైక్రోసాఫ్ట్‌లో గ్లోబల్ అఫైర్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో జాతీయ భద్రతా సీనియర్ సలహాదారుగా కూడా విధులు నిర్వర్తించారు. అనంతరం బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిప్యూటీ అటార్నీగా జనరల్‌గా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె ఈ ఏడాది జులైలో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె అత్యంత సున్నితమైన సమాచారం పొందగలిగే సీనియర్ హోదాలో ఉన్నారు. దీంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కోరారు.
ఇది కూడా చదవండి: Sonam Wangchuk: జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తా.. సోనమ్ వాంగ్‌చుక్ హెచ్చరిక
లీసా మోనాకో అవినీతిపరురాలు. తీవ్రవాద కార్యకర్త. జాతీయ భద్రతకు ముప్పుగా ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి సమాచారం పొందకుండా ఆమెపై ఇప్పటికే ఆంక్షలు విధించామని చెప్పారు. అందుకే వెంటనే మైక్రోసాఫ్ట్ పదవి నుంచి ఆమెను తొలగించాలన్నది తన అభిప్రాయమని తెలిపారు. ఈ డిమాండ్‌పై మైక్రోసాఫ్ట్‌ను ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్-మెలానియా మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్