Microsoft Layoffs 2025: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రెడీ అవుతుంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కోతలు విధిస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం వల్ల ప్రధానంగా మిడిల్ మేనేజ్‌మెంట్, నాన్-టెక్నికల్ ఎంప్లాయిస్ తమ ఉద్యోగం కోల్పోయే ఛాన్స్ ఉంది. మే నెలలో ఈ లేఆఫ్స్ ఉండనుందని టాక్. అయితే ఈ ఎఫెక్ట్ ఎంత మందిపై పడనుందని అనేది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
Read Also: Astrology: ఏప్రిల్ 11, శుక్రవారం దినఫలాలు
అయితే, అమెజాన్, గూగుల్ కంపెనీల బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక ప్రతిభకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లేఆఫ్స్ చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ గతంలో కూడా.. తక్కువ పని తీరు కనబర్చిన 2,000 మంది ఎంప్లాయిస్ ను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో జరగనున్న ఉద్యోగాల తొలగింపు ప్రభావం కూడా పని తీరు తక్కువగా ఉన్న వారి మీద పడే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
కాగా, భవిష్యత్ ఆవిష్కరణలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారనుంది. కాబట్టి 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గతంలోనే తెలియజేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఏఐ ఆధిపత్యం పెరిగిపోయింది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు రెడీ అవుతున్నాయి.