Swami Vivekananda Statue Unveiled In Mexico: లాటిన్ అమెరికా దేశాల్లోనే తొలిసారిగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెక్సికో దేశంలోని ఓ యూనివర్సిటీలో స్వామి వివేకానంద విగ్రహాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఆవిష్కరించారు. మెక్సికోలోని భారత పార్లమెంటరీ బృందానికి ఓం బిర్లా నాయకత్వం వహించారు. మెక్సికోలోని మిడాల్గోలోని అలానమస్ యూనివర్సిటీ ఆఫ్ స్టేట్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వివేకానందుడి బోధనలు, వ్యక్తిత్వం భారతదేశంలోనే కాకుండా ప్రపంచదేశాల ప్రజలకు కూడా…
Montenegro mass shooting: బాల్టిక్ దేశం మాంటెనెగ్రోలో దారుణం జరిగింది. సిటింజే సిటీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 11 మందిని హతమర్చాడు. వేటాడే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మాంటెనెగ్రో పోలీస్ డైరెక్టర్ జోరన్ బ్రిడ్జానిన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 34 ఏళ్ల వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. అమెరికాకు కంటైనర్ ట్రక్ లో వలస వస్తున్న వారు కంటైనర్ లోనే మరణించారు. ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన వేడి కారణంగా అందులోనే చనిపోయారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య 51కి చేరింది. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో మంగళవారం రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్ కంటైనర్ లో పెద్ద సంఖ్యలో శవాలను కనుక్కున్నారు. మరణించిన వారిలో 39 మంది పురుషులు ఉండగా..12 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.…
At least 12 people were killed in a confrontation between police and armed civilians in the town of El Salto, in west Mexico's Jalisco state, state governor Enrique Alfaro confirmed Thursday.
వీధు కుక్కలు సరేసరి.. వాటి ఇష్టారాజ్యం.. కానీ, పెంపుడు కుక్కలు రోజుకు ఒకసారి లేదా రెండు మూడుసార్లు బయటకు తిప్పడం మళ్లీ ఇంట్లో పెట్టడం చేస్తుంటారు.. అయితే, ఏమైందో..? ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ శునకం ఎయిర్పోర్ట్లోప్రత్యక్షమైంది.. రన్‌వేపై పరుగులు పెడుతూ.. ఎయిర్పోర్ట్ సిబ్బందికి చుక్కలు చూపించింది.. దీనికి సంబంధించిన వీడియోను చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఎయిర్‌పోర్ట్‌లో పరుగులు పెట్టడమే కాదు.. లక్షల్లో వ్యూస్..…
మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. అసలు పక్షులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తాం. కానీ, మెక్సికోలో వందలాది పక్షులు ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాయి. పక్షులన్నీ గుంపుగా కిందపడిపోవడంతో అందులో చాలా పక్షులు రోడ్డుపై పడి మరణించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఫిబ్రవరి 7 వ తేదీన జరిగింది.…
హోటల్ కి వెళ్లి ఏదైనా ఆర్డర్ చేస్తే టేబుల్ ముందుకు రావడానికి కనీసం 10 నిమిషాల సమయమైనా పడుతుంది. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ సమయమైనా పట్టవచ్చు. కాకా హోటల్‌కి వెళ్లినా కావాల్సింది ఇవ్వడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది. ఆర్డర్ చేసింది క్షణాల్లో టేబుల్ ముందుకు రావాలంటే కుదరని పని. అయితే, మెక్సికో లోని కర్నే గారిబాల్డీ అనే హోటల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ హోటల్లో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా క్షణాల్లోనే టేబుల్…
మ్యాజిక్ ను ఎవరు చేసినా అవాక్కవుతాం. కళ్లకు కనికట్టు చేయడమే మ్యాజిక్. మాములు మనుషులతో ఆటు జంతువులు కూడా అప్పుడప్పుడు మ్యాజిక్‌ను చూసి షాక్ అవుతుంటాయి. జూకు వెల్లిన ఓ యువతి కోతి ముందు ఓ అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఆ మ్యాజిక్‌ను చూసి షాకైన ఆ కోతి విచిత్రంగా ప్రవర్తించింది. దానికి సంబంధించిన వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ సంఘటన మెక్సికోలోని జూలో జరిగింది. ఈ జూకు…
పెళ్లి వేడుకలకు వందలాది మంది అతిథులు తరలివస్తుంటారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తుంటారు. మెక్సికోలోని న్యూవో లియోన్ పర్వత ప్రాంతంలో ఇటీవలే ఓ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన అతిథుల కోసం రిసెప్షన్ హాలులో భోజనం ఏర్పాట్లు చేశారు. అందరూ భోజనాలు చేస్తుండగా అనుకోని అతిథి అక్కడికి వచ్చింది. దాన్ని చూసి జనాలు హడలిపోయారు. అయితే, వారిని ఏమి చేయని ఆ అతిథి ఎలుగుబంటి అక్కడ ఉన్న…
దశాబ్దాల పోరాటం తరువాత ఫెడరల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. దశాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో పరిపాలన సాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా క్యూబాలో అల్లర్లు చెలరేగుతున్నాయి. కరోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం తదితర అంశాలు దేశాన్ని పట్టిపీడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రజలు హవానాకు చేరుకొని ఉద్యమం చేస్తున్నారు. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్ కనెల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు స్వేచ్చకావాలి వెంటనే అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలు…