TS Weather : ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. అదే క్రమంలో వాతావరణం చల్లగా మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తింది. దీంతో జనాలు ఎప్పుడు వాన పడుతుందో.. ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.. ఇక, ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈరోజు ఉదయం 8.30 గంటల వరకు వాతావరణ విశ్లేషణ ప్రకారం.. తెలంగాణలో రాగల మూడు రోజుల వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు.. నిన్నటి ఉపరితల ఆవర్తనం…
తెలంగాణ వాతావారణ శాఖ హెచ్చిరిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, సిద్ధిపేట, శామీర్ పేటతో పాటు యాదాద్రి, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం జిల్లాల్లో పిడుగులతో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. Read Also: బీజేపీ చరిత్ర మార్చే…
మరోరెండు రోజులు ఏపీలో వర్షాలుబంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో…
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే…
దక్షిణ బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల27 వరకు తేలిక పాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి…