తెలంగాణ వాతావారణ శాఖ హెచ్చిరిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందిని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, సిద్ధిపేట, శామీర్ పేటతో పాటు యాదాద్రి, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం జిల్లాల్లో పిడుగులతో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Also: బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది: జగ్గారెడ్డి
ఇప్పటికే పలు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షం పడోచ్చని. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు ఉదయం నుంచి ఆకాశం మేఘాలతో నిండి ఉంది… చల్లని గాలులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో చలి తీవ్రత కాస్త తగ్గింది.