గుజరాత్‌లో సౌరాష్ట్ర నుంచి కచ్ వరకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వడోదర నుంచి రాజ్‌కోట్ వరకు, జామ్‌నగర్ నుంచి ఖేడా వరకు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
IMD Alert: దేశవ్యాప్తంగా రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Delhi Rain: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలతో వీకెండ్ స్టార్ట్ అయింది. గురువారం నుంచి ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిస్తే.. శుక్రవారం సాయంత్రం నుంచి పడుతున్న వాన ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని జనానికి కాస్తా రిలీఫ్ ఇచ్చింది.
Weather Alert: భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో నేడు ( సోమ), రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలో వేడిగాలులుల తీవ్రంగా వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు.