ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం..
అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దైపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. హైదరాబాద్ లో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురు, అక్కడక్కడ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ నగరానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముసురు వానలు పడుతుండడంతో వినాయక చవితి వేడుకలకు ఆటంకం ఏర్పడింది. Also Read:Doda Cloudburst:…
Winter Weather: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.
AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు (బుధవారం) ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
మరో మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన ప్రాంతం ఈరోజు మధ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీద ఉంది. దాని అనుబంధ ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్నది. ఇది దాదాపు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ సెప్టెంబరు…