Kurasala Kannababu: మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు.. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిసిశారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేం ఉన్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని…
Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని, ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ ఆధ్యుడని ఆయన తెలిపారు. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారని, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ 15…
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
కరెంట్ చార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా ఏపీ ప్రభుత్వం తయారైందని మాజీమంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. మాట తప్పి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. ఈ ఆరు నెలల్లో రూ.15,485 కోట్ల మేరా ప్రజలపై విద్యుత్ భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిమాండుకు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.…
కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు.
YCP Leaders Protest: బెజవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ నిరసన తెలిపారు.
జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు.. కవిత కౌంటర్ జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజలు నిలబడదు ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్ ని జగిత్యాల జైలులో కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. హబ్సిపూర్ సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసు పెట్టించారని మండిపడ్డారు. జగిత్యాలలో 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ చేశారని…
అసంతృప్తితో సీఎం వైఎస్ జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారి వల్ల ఆయనకు ఏం నష్టం జరగదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లి.. మా ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. మా ప్రభుత్వం నచ్చక ఆమె మాట్లాడుతుందని, ఎవరైనా ఆమె మాటలు నమ్మతారా? అని ప్రశ్నించారు. భావితరాల కోసం పనిచేసే విజనరీ ఉన్న నాయకుడు సీఎం జగన్ అని, తనకు ఓటేయాలని ధైర్యంగా…
రేపు విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహా విష్కరణకు అందరూ హాజరు కావాలి అని మంత్రి మేరుగు నాగార్జున కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరణ చేస్తారు అని చెప్పారు.
ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి.