జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు.. కవిత కౌంటర్
జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజలు నిలబడదు ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్ ని జగిత్యాల జైలులో కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. హబ్సిపూర్ సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసు పెట్టించారని మండిపడ్డారు. జగిత్యాలలో 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ చేశారని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే మా నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు జీవన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యమా? లే ఖకిల రాజ్యమా? అని ప్రశ్నించారు.
సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 17 సినిమాలు రిలీజ్..
ప్రతి వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కన్నా కూడా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది.. ప్రతి వారం లాగే ఈ వారం ఏకంగా 17 సినిమాలను ఓటీటిలో విడుదల చేయబోతున్నారు.. జవవరి చివరి వారంలోనూ మరికొన్ని చిత్రాలు” థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటికే రిలీజైన ధనుశ్ కెప్టెన్ మిల్లర్, అయలాన్ తెలుగులోనూ రిలీజవుతున్నాయి..
ఈ వారం కొన్ని సినిమాలు విడుదల అవుతున్నా కూడా వాటిని పెద్దగా ఎవ్వరు పట్టించుకోవడం లేదు.. దాంతో అందరు ఓటీటీలో విడుదలయ్యే సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు… ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ ప్రియుల కోసం ఈ వీకెండ్‌లో సందడి చేసే సినిమాల లిస్ట్ మీకోసమే.. ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఇప్పుడు చూద్దాం..
గల్లీలో ఎవరున్నా సరే.. ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలి..!
గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఉండాలని ఎంపి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పార్లమెంట్ స్థాయి నమో నవ యువ ఓటర్లు సమ్మేళనంలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిది.. ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తు మారిపోతుందన్నారు. పేద, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తున్నారని అన్నారు. బాగా డబ్బు సంపాదించి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఓట్లు వేయడం లేదని అన్నారు. ఒక్క ఓటుతో ఎన్నికల్లో ఓడిపోయినా వ్యక్తులు ఎందరో నాయకులు ఉన్నారని తెలిపారు. సమాజంలో ఓటు వేస్తేనే విలువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశంలో మరొక్కసారి ప్రధాని గా మోడీ కావాలంటే కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి గెలవాలన్నారు. 2047 సంవత్సరం వరకు దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే దిశగా మార్చడమే మోడీ లక్ష్యం మని అన్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలు కల్పించారన్నారు.
సీఎం జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారితో ఏం నష్టం జరగదు: మంత్రి మేరుగ
అసంతృప్తితో సీఎం వైఎస్ జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారి వల్ల ఆయనకు ఏం నష్టం జరగదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లి.. మా ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. మా ప్రభుత్వం నచ్చక ఆమె మాట్లాడుతుందని, ఎవరైనా ఆమె మాటలు నమ్మతారా? అని ప్రశ్నించారు. భావితరాల కోసం పనిచేసే విజనరీ ఉన్న నాయకుడు సీఎం జగన్ అని, తనకు ఓటేయాలని ధైర్యంగా అడగగలిగిన నాయకుడు దేశంలో సీఎం జగన్ ఒక్కరే అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఆయన టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి ముగ్గురి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి ఎట్టకేలకు తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి మొత్తం 50 మంది దరఖాస్తు చేసుకోగా.. 321 మంది సభ్యుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముగ్గురిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒక్కరే కావడంతో ఆయన ఎంపికకే ప్రభుత్వం మొగ్గు చూపించింది. TSPSC చైర్మన్ నియామకానికి సంబంధించిన పత్రాలను గవర్నర్ ఆమోదించారు.
నాపై ఎందుకు కేసు పెట్టారో విశ్వేశ్వర్ రెడ్డి నే అడగండి : రంజిత్ రెడ్డి
తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నే అడగాలని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కే పరిమితం అవుతుందా? పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తుందా చూడాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బిఆర్ఎస్ ఉందన్నారు. తెలంగాణకు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామ్నారు. కాగా రంజిత్ రెడ్డిపై మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించారు. తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నే అడగాలని సూచించారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడాక తను స్పందిస్తానని క్లారిటీ ఇచ్చారు. నా 60 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు కాలేదన్నారు. నాకు సంస్కారం ఉందన్నారు.
జాతీయ ఓటరు దినోత్సవంలో గవర్నర్.. అసెంబ్లీ ఎన్నికల ఘటనపై ప్రస్తావన..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రచారం చేశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనను ఆమె ప్రస్తావించారు. తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి ప్రచారం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. ఓటు ప్రధాన ఆయుధమని ఆమె అన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయవద్దు. ప్రజాస్వామ్యం బతకాలంటే అందరూ ఓటు వేయాలని గవర్నర్ కోరారు. పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని గవర్నర్ కోరారు.
ప్రచారంపై కాదు.. పథకాలు అందించే విషయంపైనే సీఎం జగన్ ఫోకస్ పెట్టారు!
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారం గురించి ఇప్పుడే పట్టించుకోవటం లేదని, ప్రజలకు పథకాలు అందించే విషయం పైనే ఫోకస్ పెట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఎవరి ఊహకు కూడా అందని విషయమని, గతంలో ఇలాంటివి జరిగాయా? అని ప్రశ్నించారు. సీఎం వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చారని, పారదర్శకంగా పథకాలు అందుతున్నాయన్నారు. 2024 ఎన్నికలకు జనవరి 27 నుంచి భీమిలి నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు అని సజ్జల తెలిపారు.
విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… ‘2024 ఎన్నికలకు ఈ నెల 27 నుంచి భీమిలి నుంచి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకుల బాధ్యత ఎలా ఉండాలి? అని కొత్త గేమ్ రూల్స్ రూపొందించారు. క్యాడర్‌తో మహాసభ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే అంటే పవర్ కాదు.. వైసీపీలో ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యత. వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కార్యకర్తలే. ఒకే ఒక్క నాయకుడు జగన్’ అని అన్నారు.
జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలు ఇవే
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగునున్న తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మేనిఫెస్టో ప్రకటించింది. కాగా.. ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు జేడీ లక్ష్మీనారాయణ సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల కోసం పలు హామీలు ఇచ్చారు. వీటిని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ మ్యానిఫెస్టోను ఆయా వర్గాలతోనే విడుదల చేయించడమే కాకుండా దీనికి పీపుల్స్ మ్యానిఫెస్టోగా వీవీ లక్ష్మీనారాయణ నామకరణం చేశారు.
రైతులకు ప్రతి నెలా రూ.5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి రూ.15వేల నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏటా జనవరి 26న గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్ లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న SI, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.
ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష
ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ బలగం అనే పేరుతో BRS సోషల్ మీడియా ఇకపై ఉంటుందన్నారు. జిల్లా కమిటీలు లేవు… వేస్తమని, ఫిబ్రవరి రెండవ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు అని అంటున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలు స్వల్ప తేడాతో ఓటమి చెందామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గాల లో పటిష్టంగా పని చేసి ఉంటే గెలిచే వాళ్ళమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంపై కొద్ది రోజుల్లోనే అసాధారణముగా వ్యతిరేకత వచ్చిందని, హామీలు అడిగితే… మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల మనసులు గాయ పడతాయన్నారు కేటీఆర్. రేవంత్ దావోస్ కు పోయి పచ్చి అబద్ధాలు చెప్పారని, రైతు బంధు ఉండగా… మొదలు పెట్టనీ రైతు భరోసా ఇస్తున్నామని రేవంత్ అంటున్నారన్నారు. ఆత్మ హత్య చేసుకున్న తొమ్మిది మంది ఆటో డ్రైవర్ లను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. కొత్తగా వస్తే… ఎందుకు అడ్డుగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డీఎస్ చౌహాన్ కు రెండు అవార్డులు
సీనియర్ పోలీస్ అధికారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు ఒకేరోజు రెండు అత్యుత్తమ అవార్డులు లభించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే ఇండియన్ పోలీస్ మెడల్‌కు డీఎస్ చౌహాన్ ఎంపికయ్యారు. దీంతోపాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు(2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును గురువారం నాడు జెఎన్‌టియులో జరిగిన ఓటర్స్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ చేతులమీదుగా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును డీఎస్ చౌహాన్ అందుకున్నారు. ఒకే రోజు రెండు అవార్డులు రావడం పట్ల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యం అయిందని ఈ సందర్భంగా డీఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు..
భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం కల్పించిన అవకాశం ఓటు హక్కు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు అని పేర్కొన్నారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది.. మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు అని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారని.. ఓటు దొంగలు ఓటు తీసేస్తారని .. లేదా మార్చేస్తారు.. నకిలీ ఓట్లు చేర్చేస్తారని ధ్వజమెత్తారు.
ఎప్పటికప్పుడు ఓటు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని తెలిపారు. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని ఈ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన ఓటర్లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది
వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దోపిడి దొంగల పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ అగ్గి లాంటి పార్టీ అని, ఏ పార్టీతోను కలవదన్నారు కిషన్ రెడ్డి.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని బీజేపీపై ఆరోపణలు చేయాలన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటే చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ ఎలా ఒక్కటో బీఆర్‌ఎస్ చెప్పాలన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మొనగాడు ఏమీ కాదన్నారు కిషన్ రెడ్డి. ప్రతి రోజు అయోధ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మూర్ఖుడు అని ఆయన మండిపడ్డారు. ముస్లింలందరూ ఆ పార్టీతో ఏమీ లేరన్నారు. మూడో సారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి అన్నారు. ఆ మూర్ఖుడి సంగతి చెప్పడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.