రేపు విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహా విష్కరణకు అందరూ హాజరు కావాలి అని మంత్రి మేరుగు నాగార్జున కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరణ చేస్తారు అని చెప్పారు. అంబేద్కర్ భావజాలం ఈ సమాజానికి ఉపయోగపడేలా చేయాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు అనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎక్కడో ముళ్ల పొదల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు అని మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sundeep Kishan: రవితేజ గారంటే చాలా గౌరవం ఉంది.. కానీ పోటీకి దిగక తప్పడం లేదు
ఇక, దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెట్టారు.. 400 కోట్ల రూపాయలకు పైగా నిధులతో భారతదేశం గర్వ పడేలా విగ్రహం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. సమాజంలో అసమానతలు పోగొట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలు రాష్ట్రంలో నిజం అయ్యాయని మంత్రి చెప్పారు. అంబేద్కర్ ఆశయాల ప్రకారం ఏపీలో ప్రజలకు సంక్షేమ అభివృద్ది కొనసాగుతుందని మేరుగు నాగార్జున వెల్లడించారు.