Merugu Nagarjuna: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..
- కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారింది- మాజీ మంత్రి మేరుగ నాగార్జున
- దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారు- మేరుగ నాగార్జున
- పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు- మేరుగ నాగార్జున
- ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది- మేరుగ నాగార్జున.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు. అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.. చంద్రబాబు వైఖరి వలనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.. చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా, మెదిలినా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.
Read Also: IND vs BAN: వర్షం లేకపోయినా.. మూడో రోజు ఆట రద్దు!
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
ఏకంగా సీఎం చంద్రబాబే మక్కెలు విరగ్గొడతానంటూ మాట్లాడటం దేనికి సంకేతం?.. మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు? అని మేరుగ నాగార్జున అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.. తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని దుయ్యబట్టారు. కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రశ్నించారు. ఇంకో ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు..? అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?.. కోట్ల సూర్యప్రకాషరెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?.. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?.. ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?.. ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేరుగ నాగార్జున తెలిపారు.
Read Also: Tirumala Laddu: టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!