విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
టీడీపీ, చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీ టీం అన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధరేశ్వరి వెళ్ళిందని.. కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు నందిగాం సురేష్, సినీ నటుడు ఆలీ, శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషెన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాలతో సంబంధం లేకుండా అసైన్డ్ భూములు పేదలకు సీఎం జగన్ ఇచ్చారని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. లంక భూములు, చుక్కల భూములు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయన్నారు.
Minister Merugu Nagarjuna about AP CM YS Jagan: సమాజంలో దళితులు గౌరవంగా బతికేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రజల కోసం కష్టపడే సీఎం జగన్‌ను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నామని…
ఎవరైనా దళితుడిగా పుట్టాలి అపుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు టీడీపీ దళితుల ఏమైపోయారు?.. జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేసిన సంక్షేమంపై చర్చకు టీడీపీ రాగలుగుతుందా? అని మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు.
Merugu Nagarjuna React on 125 feet statue of Ambedkar: సామాన్యుడైనా, వీవీఐపీ అయినా.. జైల్‌లో ఒకే విధంగా చూస్తారు అని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రోగాలు రాకుండా ఎవరైనా ఉంటారా? అని, వస్తే టాబ్లెట్ వేసుకోవడమే అని విమర్శించారు. కష్టపడి పని చేసే వారి గురించి మాట్లాడడం మానేసి.. దొంగల గురించి బాధపడుతున్నారా? అని మంత్రి నాగార్జున ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మేరుగు నాగార్జున.. టీడీపీ…