Bradman Baggy Green: డాన్ బ్రాడ్‌మాన్.. ఈ గొప్ప క్రికెట్ ఆటగాడి గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు తరచుగా రికార్డ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో కనపడుతూ ఉంటుంది. ఇకపోతే, అతని పేరు మీద మరో రికార్డు నమోదైంది. ఎందుకంటే, అతని ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అత్యంత ఖరీదైన క్రికెట్ వస్తువులలో ఒకటిగా అమ్ముడబోయింది. ఈ టోపీ బ్రాడ్‌మాన్ ధరించిన ఏకైక ‘బ్యాగీ గ్రీన్’ అని సమాచారం. కాబట్టి, దీనికి అపారమైన చారిత్రక ప్రాముఖ్యత…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. మెగా వేలంలో 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆర్‌సీబీ ఐపీఎల్ కి ముందే ఓ వివాదంలో చిక్కుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. కాగా.. రెండో రోజు వేలం ప్రారంభమైంది. అందులో భాగంగా.. మెగా వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. ముఖ్యంగా.. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రూ. 10.75 కోట్లకు అమ్ముడు పోయాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జెద్దా (సౌదీ అరేబియా)లో జరుగనుంది. ఈసారి వేలంలో 574 మంది ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. అందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఈసారి ఐపీఎల్ వేలంలో నిలిచిన అత్యంత పిన్న వయస్కుడు 14 ఏళ్లు కాగా, పెద్ద వయసు ఆటగాడు 42 ఏళ్లు.
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు... ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఫ్రాంచైజీ పంత్‌ను విడుదల చేయడంతో 2020 ఫైనలిస్ట్‌లతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధం ముగిసింది. కాగా.. ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్‌లో అక్షర్ పటేల్ మొదటి ఎంపికగా ఉన్నారు.
రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. కాగా.. లక్నో జట్టు ఓనర్ గోయెంకా ఆ పుకార్లను ఖండించారు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయలేడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏం సంబంధం లేదని కైఫ్ అన్నాడు. తన దృష్టిలో రోహిత్ శర్మ గొప్ప సారథి అని స్పష్టం చేశాడు. సరైన ఆటగాళ్లు లేకుంటే జట్టులో ఎంతటి గొప్ప కెప్టెన్ ఉన్నా టీమ్‌ను…
ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం. ఈ జాబితాలో…
త్వరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టబోతున్న రెండు కొత్త ఫ్రాంచైజీలపై అందరి దృష్టి నెలకొని ఉంది. అయితే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ జట్టుతో ఉంటాడో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై కోహ్లీ స్పందించాడు. తనను వేలంలో పాల్గొనమని చాలా ఫ్రాంచైజీలు కోరుతున్నాయని.. కానీ తాను మాత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తోనే ఉంటానని కోహ్లీ స్పష్టం చేశాడు. 8 సంవత్సరాల పాటు ఆర్సీబీకి సారథ్యం…