ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జెద్దా (సౌదీ అరేబియా)లో జరుగనుంది. ఈసారి వేలంలో 574 మంది ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. అందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఈసారి ఐపీఎల్ వేలంలో నిలిచిన అత్యంత పిన్న వయస్కుడు 14 ఏళ్లు కాగా, పెద్ద వయసు ఆటగాడు 42 ఏళ్లు.
Crime: రోడ్డు పక్కన సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం..
అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ:
ఐపీఎల్ 2025 వేలంలో నిలిచిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, అతనికి 14 సంవత్సరాలు. వైభవ్ సూర్యవంశీ బీహార్ తరపున ఆడుతున్నాడు. అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, స్పిన్ బౌల్ కూడా చేస్తాడు. ఈ రంజీ సీజన్‌లో వైభవ్ బీహార్ తరఫున ఆడుతున్నాడు. ఈ వేలంలో అతని బేస్ ధర రూ. 30 లక్షలు. ఈ వేలంలో పాల్గొన్న అతి పెద్ద వయసు ఆటగాడు జేమ్స్ అండర్సన్, ఇతనికి 42 ఏళ్లు. ఈ వేలంలో అండర్సన్ తన బేస్ ధరను రూ.1.25 కోట్లుగా ఉంచుకున్నాడు.
81 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల స్లాబ్‌లో ఉన్నారు:
ఐపీఎల్ 2025 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ధర కలిగిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య 81 ఉండగా.. రూ. 1.25 కోట్ల స్లాబ్‌లో 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. రూ. 1.5 కోట్ల బేస్ ధర కలిగిన ఆటగాళ్ల సంఖ్య 27 ప్లేయర్లు ఉండగా.. మొత్తం 23 మంది ఆటగాళ్లను కోటి రూపాయల ధర స్లాబ్‌లో చేర్చారు. ఈసారి 92 మంది ఆటగాళ్లకు రూ.75 లక్షలు, 8 మంది ఆటగాళ్లకు రూ.50 లక్షలు, 5 మంది ఆటగాళ్లకు రూ.40 లక్షలు బేస్ ధరగా నిర్ణయించారు. ఈసారి 320 మంది ఆటగాళ్లు తమ పేర్లను రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో నమోదు చేసుకున్నారు.