క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2022 మెగావేలానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. అలాగే ఈ ఏడాది కొత్తగా వస్తున్న లక్నో, అహ్మదాబాద్ జట్లకు బీసీసీఐ ఫార్మల్ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని ఆయన ప్రకటించారు. ఆయా ఫ్రాంఛైజీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు బిడ్‌లను గవర్నింగ్…
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 కి రెండు కొత్త జట్లు రావడంతో మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. అయితే ఈ మెగా వేలానికి ముందు ఇప్పటివరకు ఆడుతున్న 8 జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేయాలనీ ప్రకటించింది. గరిష్టంగా 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని ప్రకటించిన బీసీసీఐ… ఆ జాబితాను ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో అన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నట్లు…